NEWSTELANGANA

విద్యా..నీటి పారుద‌ల‌కు పెద్ద‌పీట

Share it with your family & friends

తెలంగాణ బ‌డ్జెట్ లో భారీగా నిధులు

హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్ర బ‌డ్జెట్ 2024-25కు సంబంధించి ఉప ముఖ్య‌మంత్రి గురువారం శాస‌న స‌భ‌లో ప్ర‌వేశ పెట్టారు. ఈ సంద‌ర్బంగా విద్యా, నీటి పారుద‌ల‌కు అత్య‌ధికంగా నిధులు కేటాయించారు. మొత్తం బ‌డ్జెట్ ను 1,91,159 కోట్ల‌తో రూపొందించారు.

ఇక శాఖ‌ల వారీగా చూస్తే ఇలా ఉన్నాయి. హార్టికల్చర్‌కు రూ.737 కోట్లు కేటాయించారు. రోడ్లు, భవనాలకు రూ.5,790 కోట్లు, హోంశాఖకు రూ.9,564 కోట్లు, పశుసంవర్ధక శాఖకు రూ. 1,980 కోట్లు.. విద్యా శాఖకు రూ. 21,292 కోట్లు.. నీటి పారుదల శాఖకు రూ.22,301 కోట్లు, ప్రజాపంపిణీకి రూ.3,836 కోట్లు కేటాయించారు.

ఇక గృహ జ్యోతికి రూ.2,418 కోట్లు, పరిశ్రమల శాఖకు రూ.2,762 కోట్లు.. ఐటీ శాఖకు రూ.774 కోట్లు.. 500 రూపాయల గ్యాస్‌ సిలిండర్‌కు రూ.723 కోట్లు.. అడవులు పర్యావరణ శాఖకు రూ.1064 కోట్లు.. ట్రాన్స్‌కో, డిస్కంలకు రూ.16,410 కోట్లు.. వైద్య ఆరోగ్య శాఖకు రూ.11,468 కోట్లు.. బీసీ సంక్షేమానికి రూ.9,200 కోట్లు.. మైనార్టీ శాఖకు రూ.3,003 కోట్లు కేటాయించారు.

స్త్రీ శిశు సంక్షేమ శాఖకు రూ.2,736 కోట్లు.. రీజినల్ రింగ్‌రోడ్‌కు రూ.1525 కోట్లు.. గృహజ్యోతికి రూ.2,418 కోట్లు.. ఎస్సీ సంక్షేమానికి రూ.33,124 కోట్లు.. ఎస్టీ సంక్షేమానికి రూ.17,056 కోట్లు.. జీహెచ్‌ఎంసీ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు రూ.3,065 కోట్లు కేటాయించారు.

హెచ్‌ఎండీఏ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు రూ.500 కోట్లు.. మెట్రో వాటర్‌ వర్క్స్‌ కోసం రూ.3385 కోట్లు.. హైడ్రాకు రూ.200 కోట్లు కేటాయింపు.. ఎయిర్‌పోర్టు వరకు మెట్రో విస్తరణకూ రూ.100 కోట్లు.. ఔటర్‌ రింగ్‌ రోడ్డు కోసం రూ.200 కోట్లు.. హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్ట్‌ కోసం రూ.500 కోట్లు.. మల్టీ మోడల్‌ సబర్బన్‌ రైలు ట్రాన్స్‌పోర్టు సిస్టంకు రూ. కోట్లు.. మూసీ రివర్‌ ఫ్రంట్‌ ప్రాజెక్టు కోసం రూ.1,500 కోట్లు.. హైదరాబాద్‌ నగరాభివృద్ధి కోసం రూ.10 వేల కోట్లు.. ఇందిరా మహిళా శక్తి పథకానికి రూ.50.41 కోట్లు కేటాయించారు.