డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్ – రాష్ట్రంలో డ్రగ్స్ నియంత్రణపై ఉక్కు పాదం మోపుతామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. తెలంగాణ బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. హోం శాఖకు రూ. 10,188 కోట్లు కేటాయించామన్నారు. డ్రగ్స్ ను నియంత్రించేందుకు మిత్ర యాప్ తీసుకు వస్తామన్నారు. ఇది హైదరాబాద్ లోనే కాదు రాష్ట్రమంతటా విస్తరిస్తామని చెప్పారు. మాదక ద్రవ్యాల నేరాల్లో ఎంతటి వారున్నా చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. ఐటీ కేంద్రంగా వరంగల్ ను తీర్చి దిద్దుతామని ప్రకటించారు.
విద్య, వైద్య, ఐటీ కేంద్రంగా మారుస్తామన్నారు. నిజామాబాద్, ఖమ్మంను వ్యవసాయాధారిత పరిశ్రమలు, తయారీ రంగానికి కేంద్రాలుగా తీర్చి దిద్దుతామన్నారు. ప్రపంచంలోనే అత్యాధునిక సౌకర్యాలతో ఫ్యూచర్ సిటీ నిర్మిస్తామన్నారు. నాగార్జున సాగర్, శ్రీశైలం రహదారుల మధ్య 7565 చ.కి.మీ విస్తీర్ణంలో ఉంటుందన్నారు. ప్రాజెక్టు పర్యవేక్షణకు ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గ్రీన్ బిల్డింగ్స్, ఎలక్ట్రిక్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్, మల్టీమోడల్ కనెక్టివిటీ వంటి ఆధునిక సౌకర్యాలు కల్పిస్తామన్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ, స్పోర్ట్స్ సిటీ, ఫార్మా హబ్, క్లీన్ ఎనర్జీ, ఇన్నొవేషన్ జోన్ ఇందులో భాగంగా ఉంటాయని చెప్పారు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క.