శాసన సభలో ప్రవేశ పెట్టిన భట్టి
హైదరాబాద్ – శాసన సభలో డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి మొత్తం వ్యయం 3,04,965 కోట్లుగా తేల్చారు. రెవెన్యూ వ్యయం 5.2,26,982 కోట్లు కాఆ , మూలధన వ్యయం రూ.36,504 కోట్లుగా ప్రతిపాదించారు. ఇక తాజా బడ్జెట్ లో సామాజిక ప్రయోజనం కలిగించే కార్యక్రమాలు, పథకాలకు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు. విచిత్రం ఏమిటంటే అత్యధిక జనాభా కలిగిన బీసీల సంక్షేమానికి తక్కువ నిధులు కేటాయించారు. అదే ఎస్సీ, ఎస్టీ రంగాలకు భారీగా బడ్జెట్ లో కేటాయింపులు జరిపారు. దీనిపై బీసీ వర్గాలు భగ్గుమంటున్నాయి.
ఇదిలా ఉండగా తాజాగా తెలంగాణ బడ్జెట్ లో అత్యధికంగా ఎస్సీ సంక్షేమ శాఖకు కేటాయించారు. ఏకంగా రూ. 40,232 కోట్లు కేటాయించారు. పౌర సరఫరాల శాఖకు రూ. 5,734 కోట్లు , పరిశ్రమల శాఖకు కేవలం రూ. 3,527 కోట్లు విదిల్చారు. ఇక రోడ్లు భవనాల శాఖకు సంబంధించి రూ. 5,907 కోట్లు , పట్టణాభివృద్ది శాఖకు రూ. 17,677 కోట్లు , పంచాయతీరాజ్ శాఖకు రూ. 31,605 కోట్లు కేటాయించారు.
రాష్ట్ర జనాభాలో అత్యధిక వాటా కలిగిన బీసీలకు సంబంధించి సంక్షేమ శాఖకు కేవలం రూ. 11,405 కోట్లు విదిల్చారు భట్టి విక్రమార్క. ఎస్టీ సంక్షేమ శాఖకు రూ. 17,169 కోట్లు , మైనార్టీ సంక్షేమానికి రూ. 3,591 కోట్లు , ఐటీ శాఖకు రూ. 7,704 కోట్లు కేటాయించారు. ఇక మహాలక్ష్మీ బస్సు పథకం ద్వారా ఆదా అయ్యిందన్నారు. ఇక సిలిండర్ పథకానికి రూ. 433 కోట్లు ఇచ్చారు.