NEWSTELANGANA

రూ.2,75,891 కోట్లతో తెలంగాణ బ‌డ్జెట్

Share it with your family & friends

రెవెన్యూ వ్యయం రూ.2,01,178 కోట్లు

హైద‌రాబాద్ – తెలంగాణ శాస‌న స‌భ‌లో శ‌నివారం డిప్యూటీ సీఎం , ఆర్థిక శాఖ మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క ఓట్ ఆన్ అకౌంట్ బ‌డ్జెట్ ను ప్ర‌వేశ పెట్టారు. మొత్తం రూ. 2,75,891 కోట్ల‌తో బ‌డ్జెట్ ను రూపొందించారు. ఇందులో మూల ధ‌న వ్య‌యం రూ. 29,669 కోట్లు ఉండ‌గా ఆరు గ్యారెంటీల అమ‌లుకు రూ. 53,196 కోట్లు కేటాయించారు. ఇక రెవిన్యూ ఖ‌ర్చు రూ. 2,01,178 కోట్లు గా ఉంద‌ని ఆర్థిక మంత్రి వెల్ల‌డించారు.

కాగా ప్ర‌ధాన రంగ‌మైన వ్య‌వ‌సాయ శాఖ‌కు త‌క్కువగా కేటాయింపులు జ‌ర‌ప‌డం విస్తు పోయేలా చేసింది. అత్య‌ధికంగా పంచాయ‌తీరాజ్ శాఖ‌కు కేటాయించ‌డం విశేషం. ఇక భ‌ట్టి ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్ లో శాఖ‌ల వారీగా చూస్తే ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌కు రూ. 2,543 కోట్లు, ఐటీ శాఖకు రూ. 774 కోట్లు, పంచాయ‌తీరాజ్ శాఖ‌కు ఏకంగా రూ. 40,080 కోట్లు కేటాయించారు.

ఇక పుర‌పాలిక శాఖ‌క‌కు రూ. 11,692 కోట్లు, మూసీ రిఫ‌ర్ ప్రాజెక్టుకు రూ. 1,000 కోట్లు, వ్యవ‌సాయ శాఖ‌కు రూ. 19,746 కోట్లు కేటాయించారు. ఇక ఎస్సీ, ఎస్టీ సామాజిక వ‌ర్గాల గురుకుల భ‌వ‌నాల నిర్మాణాల కోసం రూ. 1250 కోట్లు , ఎస్సీ సంక్షేమానికి రూ. 21,874 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి రూ. 13,013 కోట్లు, మైనార్టీ సంక్షేమానికి రూ. 2,262 కోట్లు కేటాయించారు.