సీఎం రేవంత్ ఆధ్వర్యంలో కేబినెట్ ఓకే
హైదరాబాద్ – ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం కొత్త సర్కార్ ప్రవేశ పెట్టే బడ్జెట్ పై ఉత్కంఠ నెలకొంది. ఆరు గ్యారెంటీల అమలుకు సంబంధించి బడ్జెట్ లో కేటాయింపులు జరపనున్నట్లు సమాచారం.
అసెంబ్లీలో ఒకరిపై మరొకరు తీవ్ర ఆరోపణలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ సందర్బంగా హరీశ్ రావు చేసిన కామెంట్స్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. గతంలో ఎవరికీ కలిసేందుకు అవకాశం ఇవ్వని బావ బావమరుదులు కేటీఆర్, హరీశ్ రావులు ఉన్నట్టుండి రూట్ మార్చారని ఎద్దేవా చేశారు. ఎవరిని ఉద్దరించేందుకు ఆటోలలో బయలు దేరారో చెప్పాలన్నారు.
ఆటో రాముడు తన ఆటలు సాగవని తెలుసు కోవాలన్నారు. ప్రజలు వీరి నిర్వాకాన్ని భరించ లేకనే తమకు అధికారాన్ని అప్పగించారని తెలుసు కోవాలని , అది కూడా గుర్తించక పోతే చివరకు లోక్ సభ ఎన్నికల్లో రిక్త హస్తం తప్పదని హెచ్చరించారు సీఎం రేవంత్ రెడ్డి.
ప్రస్తుతం అసెంబ్లీలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశ పెట్టనున్నారు.