NEWSTELANGANA

త‌డిసిన ధాన్యం కొనుగోలు చేస్తాం

Share it with your family & friends

స్ప‌ష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ – భారీ వ‌ర్షాల కార‌ణంగా పంట‌లు కోల్పోయిన రైతుల‌కు భ‌రోసా ఇచ్చే ప్ర‌య‌త్నం చేసింది రాష్ట్ర కాంగ్రెస్ స‌ర్కార్. మంత్రివ‌ర్గం భేటీలో కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న ఈ స‌మావేశం జ‌రిగింది.

జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించాల‌ని తీర్మానం చేసింది. ఈ వేడుక‌ల‌కు ఏఐసీసీ మాజీ చీఫ్ , సీపీపీ చైర్ ప‌ర్స‌న్ సోనియా గాంధీని ప్ర‌త్యేక ఆహ్వానితురాలిగా పిలుస్తున్న‌ట్లు తెలిపింది.

ఈ సంద‌ర్బంగా ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది కేబినెట్. వ‌ర్షాల కార‌ణంగా న‌ష్ట పోయిన రైతుల‌ను ఆదుకుంటామ‌ని హామీ ఇచ్చింది. త‌డిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామ‌ని ప్ర‌క‌టించింది కాంగ్రెస్ స‌ర్కార్. రైతులు ఎవ‌రూ ఆందోళ‌నకు గురి కావ‌ద్ద‌ని కోరారు ఈ సంద‌ర్బంగా సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి.

స‌న్న వ‌డ్లు పండించిన రైతుల‌కు క్వింటాల‌కు రూ. 500 బోన‌స్ ను వ‌చ్చే సీజ‌న్ నుంచి ఇస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. ఈ విష‌యాన్ని రాష్ట్ర స‌మాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి తెలిపారు.