తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్ సుదీర్ఘంగా సమావేశమైంది. 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్ల కోసం రూ. 22,500 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రతీ నియోజక వర్గానికి 3500 ఇళ్లు కట్టిస్తామమని. లబ్ది దారులను గ్రామ సభల్లో ఎంపిక చేయనున్నట్లు స్పష్టం చేసింది రాష్ట్ర మంత్రివర్గం.
కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను ప్రకటించారు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ గౌడ్ , దుద్దిళ్ల శ్రీధర్ బాబు. కొత్త తెల్ల రేషన్ కార్డుల మంజూరుకు ఆమోదం తెలిపిందన్నారు. అర్హులైన ప్రతీ ఒక్కరికీ తెల్ల రేషన్ కార్డులు జారీ చేస్తామన్నారు. కుల వృత్తిదారులు, బలహీన వర్గాలకు కొత్తగా 16 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
ఇందులో భాగంగా ముదిరాజ్ కార్పొరేషన్, యాదవ కురుమ కార్పొరేషన్, మున్నూరుకాపు కార్పొరేషన్, పద్మశాలి కార్పొరేషన్, పెరిక (పురగిరి క్షత్రియ) కార్పొరేషన్, లింగాయత్ కార్పొరేషన్, మేరా కార్పొరేషన్, గంగపుత్ర కార్పొరేషన్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు.
ఈబీసీల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని, ఆర్య వైశ్య కార్పొరేషన్, రెడ్డి కార్పొరేషన్ , మాల, మాదిగ ఉప కులాల కార్పొరేషన్ , కొమురం భీమ్ ఆదివాసి కార్పోరేషన్ , సంత్ సేవాలాల్ లంబాడి కార్పోరేన్ , ఏకలవ్య కార్పోరేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
మహిళల కోసం ఔటర్ రింగు రోడ్డు చుట్టు మహిళా రైతు బజార్లు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.
ఆరోగ్య శ్రీ రేషన్ కార్డుకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇక నుంచి రేషన్ కార్డు పూర్తిగా నిత్యావసర సరుకులకు మాత్రమే ఉపయోగ పడుతుందన్నారు. 2008 డీఎస్సీ అభ్యర్థులకు టైం స్కేల్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు.