హాజరు కానున్న సీఎం..మంత్రులు
హైదరాబాద్ – తెలంగాణ కేబినెట్ కీలక సమావేశం 4వ తేదీన జరగనుంది. కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసాపై చర్చిస్తారు. భూమిలేని నిరుపేద రైతులకు ఏడాదికి రూ.12 వేల సాయంపై ప్రత్యేకంగా చర్చించనున్నారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల కోసం డెడికేటెడ్ కమిషన్ నివేదికపై కూడా చర్చకు రానుందని సీఎస్ శాంతి కుమారి వెల్లడించారు.
ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున హామీలను ఇచ్చింది. వాటిని అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని. రైతు బంధు, రైతు భరోసా, పెన్షన్లు ఇచ్చేందుకు ప్రయారిటీ ఇవ్వాలని స్పష్టం చేశారు.
ఇదే సమయంలో కీలక వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. ఇప్పటికే ప్రకటించిన మేరకు 50 వేలకు పైగా జాబ్స్ ను భర్తీ చేయడం జరిగిందన్నారు. కొత్త ఏడాదిలో జాబ్స్ భర్తీకి సంబంధించి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని అన్నారు. దీంతో ప్రభుత్వం పెద్ద ఎత్తున కసరత్తు చేస్తోంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా బుర్రా వెంకటేశం గౌడ్ ను నియమించారు.