కేబినెట్ భేటీపై సీఎం ఫోకస్..?
ఫోర్త్ సిటీకి స్పెషల్ ఆఫీసర్
హైదరాబాద్ – ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. ఇదే సమయంలో త్వరలోనే రాష్ట్ర మంత్రివర్గంతో కీలక సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ప్రధానంగా విదేశీ పర్యటన తర్వాత కంపెనీలతో ఒప్పందాలు, వచ్చిన పెట్టుబడులతో పాటు తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన హైడ్రాపై కూడా చర్చించినున్నారు.
ఇదే సమయంలో హైదరాబాద్ లో మరో సిటీని నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. ఫ్యూచర్ సిటీలో ఏమేం ఉండ బోతున్నాయో కూడా ఈ కేబినెట్ భేటీలో వివరించనున్నారు సీఎం. ప్రధానంగా ఫోర్త్ సిటీకి స్పెషల్ ఆఫీసర్ ను నియమించాలని ఆలోచిస్తున్నట్లు టాక్.
మరోసారి రాష్ట్రంలోని ఐఏఎస్ లు, ఐపీఎస్ లను బదిలీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పరిపాలనపై మరింత పట్టు సాధించేందుకు వీరిని మార్చనున్నారు. ప్రధానంగా పని చేసే వారికి పదవులు కట్టబెట్టనున్నారు.
కీలక శాఖలైన విద్యుత్, ల్యాండ్ , రెవిన్యూ శాఖలలో మార్పులు రాబోతున్నాయి. ఇక హైడ్రాకు భారీ ఎత్తున సిబ్బందిని కూడా నియమించాలని సీఎం యోచిస్తున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం.