సీఎంకు కేబినెట్ సబ్ కమిటీ నివేదిక
అందజేసిన దామోదర..దుద్దిళ్ల
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ ఆదివారం హైదరాబాద్ లోని సీఎం నివాసంలో ఎ. రేవంత్ రెడ్డిని కలుసుకున్నారు. ఈ సందర్బంగా 317 జీవో పై రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది.
విస్తృతంగా చర్చలు జరిపింది. క్యాబినెట్ సబ్ కమిటీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధ్యక్షతన సభ్యులు, మంత్రులు డి. శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో పాటు నిష్ణాతులైన మేధావులతో సుదీర్ఘంగా చర్చించారు.
ఉద్యోగుల, ఉపాధ్యాయులు అందజేసిన సూచనలు, విలువైన అభిప్రాయాలను క్యాబినెట్ సబ్ కమిటీ వినతుల రూపంలో ప్రత్యక్షంగా, వెబ్సైట్ ద్వారా అప్లికేషన్స్ ను స్వీకరించింది.
వారి సమస్యల పరిష్కారానికి క్యాబినెట్ సబ్ కమిటీ సభ్యులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో పలు దఫాలుగా సమీక్షలు నిర్వహించారు. చివరకు తుది నివేదిక పత్రాలను సీల్డ్ కవర్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి అందజేశారు.
ఈ సందర్బంగా సీఎం కేబినెట్ సబ్ కమిటీ త్వరితగతిన నివేదికను తయారు చేయడం పట్ల ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.