ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు సీఎం ఓకే
వెల్లడించిన టీడీపీ నేత టీడీ జనార్దన్
హైదరాబాద్ – ఆంధ్ర వలస వాదుల ఆధిపత్యాన్ని వద్దనుకుని వేలాది మంది బలిదానం, ఆత్మ త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వ్యతిరేక విధానాలను అవలంభిస్తూ వస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయన తన స్వామి భక్తిని చాటుకుంటున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు అనుచరుడిగా గుర్తింపు పొందిన రేవంత్ రెడ్డి ఇక్కడ కేసీఆర్ , తెలంగాణ ఆనవాళ్లు లేకుండా చేయాలని కంకణం కట్టుకున్నాడని తెలంగాణవాదులు వాపోతున్నారు. ఇందుకు తగ్గట్టుగానే నిర్ణయాలు తీసుకుంటూ మరింత రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నాడని ఆవేదన చెందుతున్నారు.
ఇదిలా ఉండగా తాజాగా హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో 100 అడుగుల మాజీ సీఎం, దివంగత ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేసేందుకు స్థలం మంజూరుకు ఓకే చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయన కొలువు తీరాక ఆంధ్ర ప్రాంత ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ వచ్చారు.
మొన్నటికి మొన్న గ్రూప్ -2 పరీక్షల్లో ఏపీకి సంబంధించిన ప్రశ్నలు ఇచ్చారు. విజయోత్సవాలలో ఐటం సాంగ్స్ పాడించారు. ఇప్పుడు తెలంగాణకు ఏం చేయని ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎలా పెడతారంటూ ప్రశ్నిస్తున్నారు మేధావులు.