కాంగ్రెస్ ఏడాది పాలన సూపర్ – సీఎం
అనుముల రేవంత్ రెడ్డి కామెంట్స్
కాంగ్రెస్ ప్రభుత్వ పాలన నేటితో ఏడాది పూర్తయిందని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అన్ని రంగాలలో రాష్ట్రం అభివృద్దిలో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ఏక కాలంలో 2 లక్షల రుణ మాఫీ చేశామన్నారు. ధాన్యానికి రూ. 500 బోనస్ ఇచ్చామన్నారు.
రూ. 10,44 కోట్లతో ఉచిత విద్యుత్ అమలు చేశామన్నారు . రూ. 1433 కోట్ల రైతు భీమా వర్తింప చేశామని తెలిపారు. రూ. 95 కోట్ల పంట నష్ట పరిహారంతో పాటు రూ. 10,547 కోట్ల ధాన్యం కొనుగోలుతో భరోసా కల్పించామన్నారు సీఎం.
ఏడాది క్రితం సరిగ్గా ఇదే రోజు .. పొలానికి వెళ్లి అరక కట్టాల్సిన రైతు పోలింగ్ బూత్ కు వెళ్లి “మార్పు” కోసం ఓటేశాడని పేర్కొన్నారు అనుముల రేవంత్ రెడ్డి. ఆ ఓటు అభయ హస్తమై…రైతన్న చరిత్రను తిరగ రాసిందన్నారు.
ఒక్క ఏడాదిలో 54 వేల కోట్ల రూపాయలతో…రైతుల జీవితాల్లో పండగ తెచ్చామన్నారు. ఇది నెంబర్ కాదు…రైతులు తమ ప్రభుత్వంపై పెట్టుకున్న నమ్మకం అని స్పష్టం చేశారు.
ఈ సంతోష సమయంలో…అన్నదాతలతో కలిసి…రైతు పండుగలో పాలు పంచుకోవడానిక ఉమ్మడి పాలమూరుకు రావడం సంతోషః కలిగించిందన్నారు అనుముల రేవంత్ రెడ్డి.