బీఆర్ఎస్ డ్రామాలు ఇక చెల్లవు
స్పష్టం చేసిన తెలంగాణ కాంగ్రెస్
హైదరాబాద్ – తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నిప్పులు చెరిగింది. శుక్రవారం ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేసింది. తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా సోనియా గాంధీ వల్లే తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది అని చెప్పింది మాజీ సీఎం కేసీఆర్ కాదా అని ప్రశ్నించింది.
రాష్ట్ర బిల్లు ఆమోదం పొందిన తర్వాత సోనియా గాంధీని కలిసి కృతజ్ఞతలు తెలిపిన కుటుంబం మీది కాదా , ఆమరణ నిరాహార దీక్ష డ్రామా చేసింది ఎవరో జనానికి తెలుసని స్పష్టం చేసింది. సబ్బండ వర్గాల ప్రజలు రోడ్ల మీదకు వస్తే పెట్రోల్ బాటిల్ పట్టుకుని అగ్గి పుల్ల గీయకుండా డ్రామా చేసింది ఎవరో తెలియదని అనుకుంటే ఎలా అని నిలదీసింది కాంగ్రెస్ పార్టీ.
అందరూ పోరాటం చేస్తుంటే దీక్ష విరమణ చేసి హాస్పిటల్ లో జ్యూస్ తాగింది కేసీఆర్ కాదా అని మండిపడింది. మలిదశ ఉద్యమంలో ప్రాణాలు వదిలిన తొలి అమరుడు శ్రీకాంత్ చారి కుటుంబానికి అన్యాయం చేసింది మీరు కాదా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకే కుటుంబంలో 5 మందికి పదవులు ఇచ్చింది మీరు కాదా అంటూ కేసీఆర్ ను ఏకి పారేసింది.
రైతులకు భేడీలు వేసి జైలుకు పంపింది ఎవరో తెలుసని మరిచి పోలేదని హెచ్చరించింది.