NEWSTELANGANA

విద్వేషాల‌ను తెలంగాణ స‌హించ‌దు

Share it with your family & friends

మాజీ సీఎం కేసీఆర్ కు కాంగ్రెస్ వార్నింగ్

హైద‌రాబాద్ – కాంగ్రెస్ ప్ర‌భుత్వం కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. మాజీ సీఎం కేసీఆర్ పై మండిప‌డింది. గురువారం ట్విట్ట‌ర్ వేదిక‌గా నిప్పులు చెరిగింది. అన‌వ‌స‌ర రాద్దాంతం చేయొద్దంటూ పేర్కొంది. విద్వేషాల పునాదుల మీద రాజ‌కీయాలు చేస్తున్న‌ది ఎవ‌రో తెలంగాణ స‌మాజానికి తెలుసు అని స్ప‌ష్టం చేసింది.

భావోద్వేగాలు రెచ్చగొట్టి భవితతో ఆడుకోవడం దొర వారికి వెన్నతో పెట్టిన విద్య అంటూ ఆరోపించింది.
అధికారం కోసం అడ్డదారులు తొక్కుతూ… ఎక్కడికక్కడ విద్వేషాలు రెచ్చగొడుతూ.. విద్రోహానికి తెర లేపుతూ… విధ్వంసానికి పన్నాగం పన్నే మీరా తెలంగాణ జాతి పిత. అని ప్ర‌శ్నించింది.

ప్రాంతాలుగా విడిపోదాం… ప్రజలుగా కలిసుందాం అన్న నోరే కదా అది? ఇప్పుడు ఈ విద్వేషాలకు తెర లేపడం వెనక మీ ఉద్దేశ్యం ఏమిటి అని నిల‌దీసింది. దేశ్ కా నేత అని డప్పు కొట్టుకునే మీరు… ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక కూడా ప్రాంతీయ విద్వేషాలను రెచ్చ గొట్టడం వెనక మతలబు ఏమిటో చెప్పాల్సిన అవ‌స‌రం ఉంద‌ని పేర్కొంది.

ఉద్యమానికి ఉనికి ఇచ్చిన వారందరికి ఉత్త చేతులు చూపి.. ఇప్పుడు మల్లా అదే విద్వేష రాజకీయాలకు తెర లేపుతామంటే… చూస్తూ కూర్చోదు తెలంగాణ సమాజం అని హెచ్చ‌రించింది.