20 శాతం కమీషన్ ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారు
హైదరాబాద్ – కాంట్రాక్టర్లు ఆందోళన బాట పట్టారు. ఏకంగా సచివాలయంలోని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఛాంబర్ ముందు నిరసనకు దిగారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన 200 మందికి పైగా కాంట్రాక్టర్లు హాజరయ్యారు. భట్టిని కలిసేందుకు ప్రయత్నం చేశారు. ఎస్పీఎఫ్ ఆపండంతో కాంట్రాక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడేళ్లుగా బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని, బయట వడ్డీలకు అప్పులు తీసుకు వచ్చామని వాపోయారు. బిల్లులు కావాలంటే కనీసం 20 శాతం కమీషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు.
ఇదిలా ఉండగా కాంట్రాక్టర్లు మెరుపు ఆందోళనకు దిగడంతో సచివాలయం నుంచి హుటా హుటిన వెళ్లి పోయారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన నాటి నుంచి నేటి దాకా ఇచ్చిన హామీల అమలు కావడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఒక్క మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం మాత్రమే అమవులుతోంది. మిగతా ఏ కార్యక్రమాలు అమలు కావడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. తాజాగా రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలైంది అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.