ఏసీబీకి సీఎస్ శాంతి కుమారి లేఖ
నిధుల దుర్వినియోగంపై విచారణ
హైదరాబాద్ – రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. సీఎం ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు చకా చకా పావులు కదుపుతున్నారు. ఈ మేరకు ఆమె అవినీతి నిరోధక శాఖ (ఏసీబీకి) లేఖ రాయడం కలకలం రేపుతోంది. ఈ ఫార్ములా వన్ కారు రేస్ కు సంబంధించి నిధులు దుర్వినియోగం అయ్యాయంటూ ఇప్పటికే ప్రభుత్వం ఆరోపించింది.
ఈ మేరకు అప్పటి ఐటీ, మున్సిపల్, పట్టణాభివృద్ది శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్, ఐఏఎస్ అరవింద్ కుమార్, తదితరులు నిధులను దుర్వినియోగం చేశారంటూ పేర్కొంది. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేయాల్సిందిగా ఆదేశించింది. దీనిపై తమకు విచారణ చేపట్టేందుకు గాను అనుమతి ఇవ్వాల్సిందిగా ఏసీబీ రాష్ట్ర గవర్నర్ విష్ణు దేవ్ వర్మను కలిసి లేఖ అందచేసింది.
ఆయన న్యాయ నిపుణులను సంప్రదించారు. వారి సలహాలను తీసుకున్నారు. ఆ వెంటనే కేటీఆర్ పై విచారణకు అనుమతిచ్చారు. ఈ మేరకు పర్మిషన్ లెటర్ ను సీఎస్ కు పంపించారు రాజ్ భవన్ నుంచి దీంతో సదరు లేఖను జత చేస్తూ ఏసీబీకి లేఖ రాశారు సీఎస్ శాంతి కుమారి.
ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి వెంటనే విచారణ చేపట్టాల్సిందిగా లేఖలో కోరారు .