సీఎస్ శాంతి కుమారి సమీక్ష
హైదరాబాద్ – రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన కొత్త పథకాల అమలుపై దృష్టి సారించాలని ఆదేశించారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి. పథకాల ప్రగతిపై జిల్లాల కలెక్టర్లతో కీలక సమావేశం నిర్వహించారు. ప్రతి లబ్దిదారు ఈ కార్యక్రమానికి హాజరయ్యేలా, పండగలా ప్రారంభ వేడుకలు నిర్వహించాలని అన్నారు.
ఇందిరమ్మ ఇళ్లకు ఎంపిడీఓ, రేషన్ కార్డులకు తహశీల్దార్ బృందం, రైతు భరోసాకు డిప్యూటీ తహశీల్దార్/రెవెన్యూ ఇన్స్పెక్టర్, ఎంఏఓ ఆత్మీయ భరోసాకు MGNREGS ఏపీవోలు హాజరు కావాలని స్పష్టం చేశారు. ప్రత్యేకించి ప్రజా ప్రతినిధుల సమక్షంలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని అన్నారు శాంతి కుమారి.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వీటిని నిర్వహించేందుకు చర్యలు చేపట్టిందన్నారు. ఏ ఒక్కరు కూడా నిర్లక్ష్యం వహించరాదని, ఏ ఒక్క లబ్దిదారుడికి అన్యాయం జరగ కూడదని పేర్కొన్నారు. ఎలాంటి ఫిర్యాదులు, ఆరోపణలు లేకుండా పూర్తి పారదర్శకతతో లబ్దిదారులను ఎంపిక చేయాలని అన్నారు. ఒకవేళ ఏమైనా ఫిర్యాదులు ఉన్నట్లయితే స్వీకరించాలని సూచించారు సీఎస్.