సీఎం సంచలన నిర్ణయం
హైదరాబాద్ – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. సచివాలయంలో ఏకంగా 172 మంది సెక్షన్ ఆఫీసర్లను బదిలీ చేసింది. ఈ సందర్బంగా సీఎస్ శాంతి కుమారి కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర చరిత్రలో ప్రధానంగా సెక్రటేరియట్ లో ఇంత పెద్ద ఎత్తున సెక్షన్ ఆఫీసర్లను బదిలీ చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
ఇదిలా ఉండగా ఫోకల్ లో పనిచేసిన వారికి మళ్ళీ ఫోకల్ పోస్టింగ్స్ ఇచ్చారనే విమర్శలు ఉన్నాయి. దీనిపై ఉద్యోగ సంఘాలు భగ్గుమంటున్నాయి. ఎన్నికల సందర్బంగా ఆరు హామీలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ . అధికారంలోకి వచ్చి 14 నెలలైనా ఇప్పటి వరకు అమలులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
ఇదే సమయంలో భారీ ఎత్తున నిధులు కావాల్సి ఉంది. మరో వైపు పాలనా పరంగా మరింత పట్టు పెంచుకునేందుకు సెక్షన్ ఆఫీసర్లను బదిలీ చేసినట్లు బయట ప్రచారం జరుగుతోంది. పోలీసు శాఖలోనూ, పరిపాలనా పరంగా సీనియర్ ఐఏఎస్ లను పెద్ద ఎత్తున బదిలీ చేయడం కలకలం రేపింది. సీఎం రేవంత్ రెడ్డి ఎవరినీ ఎక్కువ కాలం ఎవరినీ కుదురుగా ఉండనీయడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.