అల్లు అర్జున్ పై డీజీపీ షాకింగ్ కామెంట్స్
మోహన్ బాబుపై కేసు నమోదు చేశాం
హైదరాబాద్ – తెలంగాణ డీజీపీ జితేందర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. నటుడు అల్లు అర్జున్ కు తాము వ్యతిరేకం కాదన్నారు. చట్ట ప్రకారమే యాక్షన్ తీసుకున్నామని చెప్పారు. ఆ రోజు సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటన అత్యంత బాధాకరమని అన్నారు.
ఆదివారం డీజీపీ మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం అల్లు అర్జున్ కు సంబంధించిన కేసు కోర్టు పరిధిలో ఉందన్నారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన దానిపై నో కామెంట్స్ పేర్కొన్నారు. ఇక మరో నటుడు మోహన్ బాబుపై కేసు నమోదు చేశామని తెలిపారు. వారివి కుటుంబ గొడవలంటూ కొట్టి పారేశారు. గన్స్ తీసుకున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే రాచకొండ సీపీ మోహన్ బాబు కుటుంబాన్ని హెచ్చరించడం జరిగిందన్నారు.
ఇక జల్ పల్లి ఫామ్ హౌస్ వద్ద చోటు చేసుకున్న ఘటనకు సంబంధించి విచారణ జరుగుతోందన్నారు. మీడియా ప్రతినిధుల దాడుల నేపథ్యంలో చట్ట ప్రకారం మోహన్ బాబుపై చర్యలు తప్పక తీసుకుంటామని చెప్పారు డీజీపీ జితేందర్.
ఏది ఏమైనా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని, ఆ విషయం గుర్తు పెట్టుకుని నడుచుకుంటే మంచిదని సూచనలు చేశారు.