విడుదల చేసిన డీజీపీ జితేందర్
హైదరాబాద్ – తెలంగాణ సైబర్ బ్యూరో ఆధ్వర్యంలో పిల్లల పేరెంట్స్ కోసం రూపొందించిన హ్యాండ్ బుక్ ను విడుదల చేశారు డీజీపీ జితేందర్. చిన్నారుల నుంచి పెద్దల దాకా సైబర్ బారిన పడుతున్నారని అన్నారు. ప్రత్యేకంగా పిల్లలను అసాంఘిక శక్తులు, సైబర్ మోసాల నుంచి కాపాడేందుకు గాను దీనిని రూపొందించడం జరిగిందని స్పష్టం చేశారు. డిజిటల్ స్పేస్ నుంచి ఎలా తమను తాము రక్షించు కోవాలో దీనిని చూసి నేర్చుకోవచ్చన్నారు.
ఆదివారం హైదరాబాద్ లోని డీజీపీ కార్యాలయంలో హ్యాండ్ బుక్ ను ఆవిష్కరించారు డీజీపీ జితేందర్. ప్రస్తుతం సోషల్ మీడియా, డిజిటల్ మీడియా అనేది అత్యంత ముఖ్యంగా మారిందన్నారు. దీని పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు . లేక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.
ప్రత్యేకించి ప్రతి రోజూ తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడో ఒక చోట సైబర్ మోసాలు జరుగుతున్నట్లు తమ దృష్టికి వస్తోందన్నారు. దీని కారణంగా ప్రత్యేకించి పిల్లలను ఈ సైబర్ దారుణాల నుంచి దూరంగా ఉండేందుకు గాను చర్యలు చేపట్టిందన్నారు. ఈ మేరకు పిల్లల తల్లిదండ్రులకు ఉపయోగకరంగా ఉండేలా ప్రతి ఒక్కరికీ మేలు చేకూర్చేలా హ్యాండ్ బుక్ తయారు చేశామని చెప్పారు డీజీపీ జితేందర్.