విద్యాభివృద్దిపై ఫోకస్ – ఆకునూరి మురళి
హాజరైన జిల్లా కలెక్టర్..జాయింట్ కలెక్టర్
జోగులాంబ గద్వాల జిల్లా – తెలంగాణలో ప్రస్తుతం విద్యారంగంపై ఎక్కువగా ప్రభుత్వం దృష్టి సారించిందని స్పష్టం చేశారు తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ , సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరి మురళి. ఆయన జోగులాంబ గద్వాల జిల్లాలో పర్యటించారు. పలు గ్రామాలలో ప్రజలను కలుసుకున్నారు. వారి అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు.
ఈ సందర్బంగా జోగులాంబ గద్వాల జిల్లాలో విద్యాభివృద్దిపై జిల్లా కలెక్టర్ సంతోష్ ఆధ్వర్యంలో పబ్లిక్ హియరింగ్ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా హాజరయ్యారు.
విద్మా రంగంలో కీలకమైన మార్పులు తీసుకు రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు ఆకునూరి మురళి. గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించిందని,, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కాస్మోటిక్ , ఇతర సౌకర్యాల కల్పనకు సంబంధించి 40 శాతం పెంచడం జరిగిందని చెప్పారు. ఖాళీలను కూడా భర్తీ చేయడం జరుగుతుందని అన్నారు విద్యా కమిషన్ చైర్మన్ .