పిల్లలతో కలిసి భోజనం చేసిన చైర్మన్
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి ఆకస్మికంగా ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న బడులు, గురుకులాలు, కేజీబీవీలను సందర్శించారు. ఈ సందర్బంగా పిల్లలతో కలిసి భోజనం చేశారు. వారితో చాలా సేపు మాట్లాడారు. ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు.
ప్రభుత్వం విద్యాభివృద్దికి ఎంతగానో కృషి చేస్తుందన్నారు ఆకునూరి మురళి. గత ప్రభుత్వం కంటే ఈసారి ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో విద్యా రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిందని తెలిపారు. భారీ ఎత్తున నిధులను కేటాయించిందని తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పనకు ప్రయారిటీ ఇస్తుందన్నారు.
విద్యా రంగ నిపుణులు, మేధావులు, బడుల నిర్వాహకుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు. ఇప్పటి వరకు 87 పాఠశాలలు, కళాశాలలు, విశ్వ విద్యాలయాలు, హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలలు, కేజీబీవీలు, మోడల్ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలు, ప్రైవేట్ కళాశాలలను సందర్శించారు.