NEWSTELANGANA

ఓవైసీకి షాక్ భారీగా ఓట్ల తొల‌గింపు

Share it with your family & friends

బీజేపీ అభ్య‌ర్థి మాధ‌వీల‌త ఫిర్యాదు

హైద‌రాబాద్ – పార్ల‌మెంట్ ఎన్నిక‌లు తెలంగాణ‌లో మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా మారాయి. గ‌త కొన్నేళ్ల నుంచి ఓట‌మి అనేది ఎరుగ‌కుండా నెగ్గుకుంటూ వ‌స్తున్నారు ఎంఐఎం చీఫ్ , సిట్టింగ్ ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ. ప్ర‌స్తుతం ఆయ‌న గ‌డ్డు ప‌రిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇక్క‌డ ఆయ‌న‌కు పోటీగా భార‌తీయ జ‌న‌తా పార్టీ ఓ మ‌హిళ‌ను నిల‌బెట్టింది. దీంతో పోటీ మ‌రింత తీవ్రంగా మారింది. ఇక్క‌డ ప్ర‌స్తుతం నువ్వా నేనా అన్న రీతిలో సాగ‌నుంద‌ని ఎన్నిక‌ల విశ్లేష‌కులు అభిప్రాయ ప‌డుతున్నారు.

ఈ త‌రుణంలో బీజేపీ అభ్య‌ర్థి కొంపెల్ల మాధవీ ల‌త ఫుల్ కాన్ఫిడెంట్ తో ఉన్నారు. తాను గెలుస్తాన‌ని , ఓవై సీ నుంచి విముక్తి క‌ల్పిస్తాన‌ని ప్ర‌క‌టించారు. ఇదే స‌మ‌యంలో కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి, రాష్ట్ర ఎన్నిక‌ల అధికారికి లిఖ‌త పూర్వ‌కంగా ఆమె ఫిర్యాదు చేశారు. భారీ ఎత్తున దొంగ ఓట్లు ఉన్నాయ‌ని, వాటిని తొల‌గించాల‌ని ఆమె కోరారు.

దీంతో రంగంలోకి దిగింది ఎన్నిక‌ల సంఘం . హైద‌రాబాద్ ఓట‌ర్ల జాబితా నుంచి భారీ ఎత్తున ఓట‌ర్ల‌ను తొల‌గించారు. 54, 259 బోగ‌స్ ఓట‌ర్లు ఉన్నార‌ని గుర్తించింది. 47 వేల 141 ఓట‌ర్లు జాబితా నుండి తొల‌గించ బ‌డ్డార‌ని పేర్కొంది.