NEWSTELANGANA

క‌రెంట్ ఛార్జీల పెంపు ఒప్పుకోం

Share it with your family & friends

కాంగ్రెస్ స‌ర్కార్ కు ఈఆర్సీ షాక్

హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ స‌ర్కార్ కు బిగ్ షాక్ ఇచ్చింది ఈఆర్సీ. రాష్ట్రంలో ప్ర‌స్తుతం విద్యుత్ ఛార్జీలు పెంచాల‌ని ప్ర‌భుత్వం యోచించింది. ఈ సంద‌ర్బంగా ప్ర‌తిపాద‌న‌లు స‌మ‌ర్పించింది ఈఆర్సీకి. దీంతో పూర్తిగా అభ్యంత‌రం తెలిపింది. దీంతో అవాక్క‌యింది స‌ర్కార్. ఏదో ర‌కంగా ఖ‌జానా నింపాల‌ని, ఆ మేర‌కు విద్యుత్ వినియోగదారుల‌పై భారీగా ఛార్జీలు పెంచి అద‌న‌పు ఆదాయం స‌మ కూరేలా చేయాల‌ని ప్లాన్ చేసింది . ఈ మేర‌కు పెద్ద ఎత్తున ఛార్జీలు పెంచుతూ ప్ర‌తిపాద‌న‌లు త‌యారు చేసింది. హడా వుడిగా దానిని తెలంగాణ విద్యుత్ రెగ్యులేట‌రీ క‌మిష‌న్ కు స‌మ‌ర్పించింది.

ప్ర‌భుత్వం త‌ర‌పు నుంచి వ‌చ్చిన స‌ర్కార్ అంద‌జేసిన ప్ర‌తిపాద‌న‌లను నిర్ద‌ద్వందంగా తిర‌స్క‌రించింది. ఈ మేర‌కు ఇప్ప‌ట్లో విద్యుత్ ఛార్జీలు పెంచేది లేద‌ని స్ప‌ష్టం చేసింది. ఇప్ప‌టికే ఆశించిన దాని కంటే ఎక్కువ‌గా ఛార్జీలు ఉన్నాయ‌ని, పూర్తిగా అద‌న‌పు భారం మోపడం మంచిది కాద‌ని పేర్కొంది ఈఆర్సీ. ఇదే స‌మ‌యంలో ప్ర‌భుత్వం తాము పేద వినియోగ‌దారుల‌కు కొన్ని యూనిట్ల మేర‌కు ఉచితంగా అంద‌జేస్తున్నామ‌ని, దీంతో అద‌న‌పు భారం విద్యుత్ సంస్త‌పై ప‌డుతోంద‌ని పేర్కొంది ప్ర‌తిపాద‌న‌ల‌లో.

ఈ సంద‌ర్బంగా తెలంగాణ ఈఆర్సీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. ఏ కేటగిరిలోనూ ఛార్జీల పెంపు లేదని ప్రకటించింది. డిస్కంల ప్రతిపాదనలను పూర్తిగా తిర‌స్క‌రించింది. పిటిషన్లపై తన అభిప్రాయాలు వెల్లడించింది ఈఆర్సీ. 800 యూనిట్లు దాటితే ఫిక్స్‌డ్‌ ఛార్జీల పెంపు. ఫిక్స్‌డ్‌ ఛార్జీలు 10 నుంచి 50 శాతానికి పెంపు. గృహ వినియోగదారులకు మినిమం ఛార్జీలు తొలగించిన ఈఆర్సీ