Wednesday, April 9, 2025
HomeNEWSతెలంగాణ కుటుంబ స‌ర్వే దేశానికి రోల్ మోడ‌ల్

తెలంగాణ కుటుంబ స‌ర్వే దేశానికి రోల్ మోడ‌ల్

ప్ర‌భుత్వ విప్ ఆది శ్రీ‌నివాస్ కీల‌క వ్యాఖ్య‌లు

హైద‌రాబాద్ – త‌మ ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టిన స‌మ‌గ్ర కుటుంబ స‌ర్వే అద్భుతంగా ఉంద‌న్నారు ప్ర‌భుత్వ విప్ ఆది శ్రీ‌నివాస్. బీసీల‌కు ఎలాంటి అన్యాయం జ‌ర‌గ‌లేద‌న్నారు. స‌ర్కార్ దృష్టిలో అంద‌రూ ఒక్క‌టేన‌ని అన్నారు. అన్ని వ‌ర్గాల‌కు న్యాయం చేసేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌న్నారు. పూర్తి పార‌ద‌ర్శ‌క‌త‌తో ఇంటింటి స‌ర్వే చేప‌ట్డం జ‌రిగింద‌న్నారు. కానీ విప‌క్షాలు చేస్తున్న ఆరోప‌ణ‌లు వాస్త‌వం కాద‌న్నారు.

ప్ర‌భుత్వ విప్ మీడియాతో మాట్లాడారు. తమ ప్ర‌భుత్వం శాస్త్రీయ ప‌ద్ద‌తిలో స‌మ‌గ్ర కుటుంబ స‌ర్వే చేసింద‌ని అన్నారు . బీసీ కుల గ‌ణ‌నపై వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌ను తోసిపుచ్చారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు.

త‌మ‌కు ఇత‌ర కులాల ప‌ట్ల కోపం ఎందుకు ఉంటుంద‌న్నారు. బ‌ల‌హీన వ‌ర్గాల‌కు న్యాయం చేయాల‌న్న‌దే త‌మ ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు. సీఎల్పీ స‌మావేశం త‌ర్వాత పూర్తి వివ‌రాలు వెల్ల‌డిస్తామ‌న్నారు. ఏమైనా అనుమానాలుంటే నివృత్తి చేసేందుకు సిద్దంగా ఉన్నామ‌న్నారు.

ప్ర‌తిప‌క్షాలు కావాల‌ని బ‌ద్నాం చేసేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నాయంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్.

RELATED ARTICLES

Most Popular

Recent Comments