విజయ డెయిరీ పై రైతుల ఆగ్రహం
పాల బిల్లుల చెల్లింపులో జాప్యం
హైదరాబాద్ – విజయ డెయిరీని నాశనం చేసేందుకు కుట్ర ఏమైనా జరుగుతుందా అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు రైతులు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి చెందిన విజయ డెయిరీ గత ఆరు నెలలుగా తీవ్ర నష్టాలను చవిచూస్తోంది.
విజయ డెయిరీ దాదాపు 1,50,000 మంది పాడి రైతుల నుండి పాలను సేకరిస్తుంది. బదులుగా, ఈ రైతులకు రోజువారీ బిల్లులను కనీసం ₹1.5 నుండి ₹2 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటుంది.
ఇవి సాధారణంగా ప్రతి 15 రోజులకు సెటిల్ చేయబడతాయి. అయితే, ఇప్పుడు నెలలు గడిచినా ఇప్పటి వరకు బిల్లులు చెల్లించక పోవడంతో రైతులు రోడ్డెక్కారు. మొత్తం రూ. 120 కోట్లకు పైగా చెల్లింపులు నిలిచి పోయాయి.
పాడి గేదెల కోసం బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న రైతులకు కిస్తులు కట్టక పోవడంతో నోటీసులు ఇస్తుండడంతో ఆవేదన చెందుతున్నారు. బిల్లులు చెల్లించాలంటూ ఆందోళన బాట పట్టారు. అయినా విజయా డెయిరీ సంస్థ ఇప్పటి వరకు స్పందించడం లేదని వాపోతున్నారు.