పాలమూరు బిడ్డా మరువదు ఈ గడ్డ
రేవంత్ రెడ్డికి రైతన్నల దీవెన
పాలమూరు జిల్లా – ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలు సంతోషానికి లోనవుతున్నారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన ఎనుముల రేవంత్ రెడ్డి ఇవాళ ముఖ్యమంత్రిగా తాను ఇచ్చిన మాటకు కట్టుబడి రైతులు తీసుకున్న రుణాలు మాఫీ చేశారు. తొలి విడతగా 11 లక్షల 50 వేల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేశారు.
రూ. 2 లక్షల రూపాయలను వచ్చే ఆగస్టు నెలాఖరులోగా జమ చేయనుంది. ఇప్పటికే బ్యాంకర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల సందర్బంగా రైతులు తీసుకున్న రుణాలను అధికారంలోకి వచ్చిన వెంటనే మాఫీ చేస్తామని వేలాది మంది సాక్షిగా ప్రకటించారు ఎనుముల రేవంత్ రెడ్డి.
ఇవాళ ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రైతు బిడ్డగా ప్రశంసలు అందుకుంటున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలలో సంబురాలు మిన్నంటాయి. రైతులు బండ్ల మీదుగా ప్రదర్శనలు చేస్తున్నారు. ఎన్నికైన ప్రజా ప్రతినిధులు ర్యాలీలుగా బయలు దేరి ఆనందాన్ని పంచుకున్నారు.
ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తన జీవితంలో ఈ రుణ మాఫీ మరిచి పోలేని మధుర జ్ఞాపకంగా మిగిలి పోతుందన్నారు. అవునూ కదూ పాలమూరు బిడ్డా నిను మరువదు ఈ గడ్డ అంటూ పొగుడుతున్నారు.