హైదరాబాద్ లో టాస్క్ ఫోర్స్ దాడులు
గడువు ముగిసినా వస్తువుల అమ్మకాలు
హైదరాబాద్ – తెలంగాణ ఫుండ్ అండ్ సేఫ్టీ శాఖ జూలు విదిల్చింది. పెద్ద ఎత్తున దాడులు చేస్తోంది. సోదాలు చేస్తూ చుక్కలు చూపిస్తోంది. మాల్స్ , హోటళ్లు, ఇతర కిరాణా దుకాణాలను సెర్చ్ చేస్తోంది. చాలా చోట్ల గడువు తీరినా వస్తువులను ఉపయోగించడంపై సీజ్ చేస్తోంది.
తాజాగా టాస్క్ ఫోర్స్ టీమ్ హైదరాబాద్ లోని మాదాపూర్ ప్రాంతంలో తనిఖీలు చేపట్టింది. రామేశ్వరం కేఫ్ లో 100 కేజీల ఉరద్ దాల్ నిల్వ ఉంచారని , దీని ఎక్స్ పైరీ డేట్ ఈ ఏడాది మార్చి 24 వరకు మాత్రమే ఉందని గుర్తించినట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు వాటిని సీజ్ చేసింది.
అంతే కాకుండా 10 కిలోల పెరుగు , 8 లీటర్ల పాలు రూ. 700 గడువు ముగిసినట్లు గుర్తించారు. ఈ విషయాన్ని రామేశ్వరం కేఫ్ యాజమాన్యానికి షాక్ ఇచ్చారు. సీజ్ చేస్తామని హెచ్చరించారు. మరోసారి ఇలాంటి గడువు తీరిన వాటిని అమ్మితే భారీ జరిమానాతో పాటు జైలుకు వెళ్లాల్సి వస్తుందని స్పష్టం చేసింది హైదరాబాద్ టాస్క్ ఫోర్స్.
రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఫుడ్ అండ్ సేఫ్టీ శాఖ ఏం చేస్తుందనే దానిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.