సేఫ్టీ నిబంధనలు పాటించని దుకాణాలు
హైదరాబాద్ – తెలంగాణ ఫుడ్ సేఫ్టీ జూలు విదిల్చింది. గత కొంత కాలంగా పలు చోట్ల ఆకస్మిక తనిఖీలు, దాడులు చేస్తోంది. హొటళ్లు, రెస్టారెంట్స్ , స్వీట్స్ షాప్స్, తదితర వాటిపై సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. పేరు పొందిన వాటిలో అసలు నాణ్యాత ప్రమాణాలు పాటించడం లేదని తేలి పోయింది. దీంతో వినియోగదారులు విస్మయానికి గురవుతున్నారు.
తాజాగా హైదరాబాద్ లోని అమీర్ పేటలో ఉన్న పలు స్వీట్ షాపులను ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. వాసిరెడ్డి ఫుడ్స్, విన్నూత్న ఫుడ్స్, ఢిల్లీ మిఠాయి వాలా, ఆగ్రా స్వీట్ షాప్స్ ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించడం లేదని వెల్లడైంది.
కాలం చెల్లిన ఫుడ్ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నట్లు గుర్తించారు. అంతే కాకుండా స్వీట్ షాప్ లో అమ్మే వస్తువులకు ఎలాంటి లేబుల్, ఎక్స్ పైరీ డేట్ లేదని స్పష్టం చేశారు. కిచెన్ లో పని చేసే వారు హెడ్ కాప్స్, గ్లౌజ్, యాప్రాన్స్ వేసుకోవట్లేదని వెల్లడైంది తనిఖీలలో.
ఎఫ్ఎస్ఎస్ఏఐ సర్టిఫికెట్ గడువు ముగిసిందని, అయినా రెన్యూవల్ చేసుకోకుండానే స్వీట్ షాప్స్ నడిపిస్తున్నారని తేలింది. రాష్ట్ర లైసెన్స్ కు బదులుగా కేవలం రిజిస్ట్రేషన్ తో దుకాణాలు నడుపుతున్నట్లు గుర్తించారు అధికారులు. దుకాణంలో డస్ట్ బిన్ లు తెరిచి ఉంచడం, కవర్లు లేకుండానే రిఫ్రిజిరేటర్లలో ఆహార పదార్థాలను నిల్వ చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.