సీఎండీ శ్రీధర్ ను రిపోర్టు చేయాలని ఆదేశం
హైదరాబాద్ – ప్రతిష్టాత్మకమైన సింగరేణి సంస్థకు కొత్త చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ)గా ఐఆర్ఎస్ అధికారి బలరాం నాయక్ ను ప్రభుత్వం నియమించింది. ఇప్పటి వరకు సీఎండీగా ఉన్న ఎన్.శ్రీధర్ పదవీకాలం ముగియడంతో ఈ నిర్ణయం తీసుకుంది.
తక్షణమే సాధారణ పరిపాలన విభాగం (జీఏడీ)లో రిపోర్టు చేయాల్సిందిగా శ్రీధర్‌ను ఆదేశించింది సర్కార్ . ఇదిలా ఉండగా ఇండియన్ రెవిన్యూ సర్వీస్ (ఐఆర్ఎస్) అధికారి అయిన బలరాం నాయక్ ప్రస్తుతం సింగరేణి ఫైనాన్స్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.
ఫైనాన్స్‌తో పాటు సంక్షేమ బాధ్యతలు కూడా ఆయనే చూసుకుంటున్నారు. వీరితో పాటు సీఎండీగా బలరాం నాయక్ అదనపు బాధ్యతలు చేపట్టనున్నారు. సుదీర్ఘ కాలం పాటు శ్రీధర్ సింగరేణికి సీఎండీగా ఉన్నారు. ఆయనపై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. అనేక అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని విమర్శలు ఉన్నాయి.
సింగరేణి సంస్థను సర్వ నాశనం చేశారని, పెట్టుబడిదారులకు వత్తాసు పలుకుతూ సంస్థను నిర్వీర్యం చేశారని కార్మిక సంఘాల నేతలు ఆరోపించారు. విచిత్రం ఏమిటంటే ఆనాటి బీఆర్ఎస్ సర్కార్ ఏకంగా శ్రీధర్ ను కొనసాగిస్తూ వచ్చింది. జనవరి 1, 2015 నుంచి సింగరేణికి సీఎండీగా ఉండడం విశేషం. ఈ విషయంలో కేంద్రం కూడా ఏమీ చేయలేక పోయింది.