ఉత్తర్వులు జారీ చేసిని సీఎస్ శాంతి కుమార్
హైదరాబాద్ – తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ మెట్రో పాలిటిన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) పరిధిని విస్తరించింది. ఈ మేరకు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. హెచ్ఎండీఏ పరిధిలోకి మరో 36 రెవెన్యూ గ్రామాలు చేరుస్తున్నట్లు స్పష్టం చేసింది. ఇక హెచ్ఎండీఏ పరిధి పెరగడంతో ఇప్పటి వరకు మొత్తం 1355 గ్రామాలు, 104 మండలాలు, 11 జిల్లాలు ఉన్నాయి. ఇక పై 10 వేల 472.72 చదరపు కిలోమీటర్లకు చేరుకుంది హెచ్ఎండీఏ పరిధి. ఇదిలా ఉండగా రాష్ట్రంలో కొత్తగా కొలువు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వం గత బీఆర్ఎస్ హయాంలో తీసుకున్న నిర్ణయాలకు మంగళం పాడడం, కొత్త నిర్ణయాలు తీసుకుంటుండడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు.
ఇప్పటికే హైడ్రా పేరుతో నానా యాగీ చేస్తున్నారు. చెరువులు, కుంటలు కబ్జాకు గురైనట్లు పేర్కొంటోంది హైడ్రా. అంతకు ముందు ఎవరు పర్మిషన్ ఇచ్చారో వారిపై చర్యలు తీసుకోకుండా ఇప్పటికే నివాసాలు ఉంటున్న వారి ఇళ్లు, భవనాలు, ఫ్లాట్స్ కూల్చి వేస్తే ఎలా అని వాపోతున్నారు నగర వాసులు. మొత్తంగా సర్కార్ వచ్చాక రియల్ ఎస్టేట్ బూమ్ పూర్తిగా పడి పోయింది. ప్రభుత్వ పాలనా తీరు పట్ల జనం తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ప్రకటించిన హామీలు ఏవీ సరిగా అమలు కాక పోవడంతో ఫైర్ అవుతున్నారు. ఈ తరుణంలో ఎల్ఎఆర్ఎస్ కోసం ప్రకటన చేయడం, మార్చి నెలాఖరు వరకే డెడ్ లైన్ విధించడం కూడా విమర్శలకు తావిస్తోంది.