అరెస్ట్ చేసేందుకు రంగం సిద్దం
హైదరాబాద్ – ఫార్ములా వన్ రేసుకు సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్ కు బిగ్ షాక్ తగిలింది. ఆయనపై కేసు నమోదు చేసేందుకు రాష్ట్ర గవర్నర్ ఆమోదం తెలిపినట్టు సమాచారం. రూ. 46 కోట్లు ఎలాంటి అనుమతి లేకుండానే తను మంత్రిగా ఉన్న సమయంలో బదిలీ చేశారంటూ ఆరోపించింది కాంగ్రెస్ ప్రభుత్వం.
ఏసీబీ కేసు నమోదు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ గవర్నర్ కు లేఖ రాసింది. లీగల్ సహాయం తీసుకున్న తర్వాత గవర్నర్ ఓకే చెప్పారు. కేటీఆర్ తో పాటు అరవింద్ కుమార్ పై కేసు నమోదు కానుంది.
ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు కేటీఆర్. రాష్ట్ర సర్కార్ పై తీవ్ర స్థాయిలో పోరాటం చేస్తున్నారు. ఇదే సమయంలో సీఎం ను టార్గెట్ చేశారు. ప్రభుత్వ అసమర్థ పాలనను ఎండగడుతూ వస్తున్నారు.
ఎలాంటి అనుమతి లేకుండానే ముందస్తు ఎలా భారీ ఎత్తున డబ్బులు చెల్లిస్తారంటూ ప్రశ్నించింది ఏసీబీ. రూల్స్ కు విరుద్దమంటూ రాష్ట్ర పురపాలిక శాఖ ఏసీబీకి ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం కేటీఆర్ అరెస్ట్ కు రంగం సిద్దం చేసినట్లు సమాచారం.