ప్రజా సంక్షేమానికి పెద్దపీట
హైదరాబాద్ – రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అసెంబ్లీలో ప్రసంగించారు. ఈ సందర్బంగా రాష్ట్రానికి గుండె కాయ రైతులేనని స్పష్టం చేశారు. ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని చెప్పారు. ఇచ్చిన హామీలను నెరవేర్చిందని చెప్పారు. వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేసిందన్నారు. రైతులను ఆదుకునేందుకు కృషి చేసిందన్నారు. యంగ్ అండ్ ఎనర్జిటిక్ లీడర్ రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రం పరుగులు తీస్తోందన్నారు.
దేశంలోనే అత్యధికంగా ధాన్యం పండిస్తున్నది తెలంగాణేనని అన్నారు. 23.35 లక్షల మంది రైతులకు ప్రయోజనం కల్పించడం జరిగిందన్ఆనరు. రైతు భరోసా కింద రూ. 12 వేలు ఇస్తున్నామన్నారు గవర్నర్. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. విద్య, వైద్యం, ఉపాధి , ఐటీ , లాజిస్టిక్ రంగాలపై ఎక్కువగా రేవంత్ రెడ్డి సర్కార్ ఫోకస్ పెట్టిందన్నారు జిష్ణు దేవ్ వర్మ. వ్యవసాయం రంగంలో కనీవిని ఎరుగని రీతిలో మార్పులు వచ్చాయని, వాటిని గుర్తించి రైతలుకు మేలు చేకూర్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.