ప్రశంసించిన గవర్నర్ వర్మ
హైదరాబాద్ – విశ్రాంత ఐఏఎస్ బీపీ ఆచార్య రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించారు రాష్ట్ర గవర్నర్ విష్ణు దేవ్ వర్మ. రాజ్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో ఆచార్య చేసిన ప్రయత్నాన్ని అభినందించారు. వృత్తి పరంగా విశిష్ట సేవలు అందించిన తర్వాత కూడా ప్రవృత్తి పరంగా మరింతగా ఎదగాలని కృషి చేయడం తనను విస్తు పోయేలా చేసిందన్నారు.
గత నాలుగు దశాబ్దాలుగా మాజీ బ్యూరోక్రాట్ చేసిన సృజనాత్మక ప్రయత్నం ఎందరికో స్పూర్తి కలిగిస్తుందని స్పష్టం చేశారు గవర్నర్. ఈ సందర్బంగా వ్యంగ్య చిత్రాన్ని గవర్నర్ వర్మ కు ప్రశంసా పత్రాన్ని అందించారు. ఇదిలా ఉండగా గవర్నర్ కు సాహిత్యం, కళలు , కార్టూన్స్ అంటే ఇష్టం. ఇదే విషయాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు.
రాబోయే కాలంలో విశ్రాంత ఐఏఎస్ బీపీ ఆచార్య మరిన్ని ప్రయోగాలు చేయాలని సూచించారు. క్రియేటివిటీ అనేది ఎవరో చెబితే రాదన్నారు. అది పుట్టుకతో స్వతహాగా వస్తుందని అన్నారు విష్ణు దేవ్ వర్మ.