రాష్ట్రపతికి పంపించిన తమిళి సై
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సోమవారం ఆమె కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉన్నట్టుండి తన గవర్నర్ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా భారతీయ జనతా పార్టీ హై కమాండ్ సూచనల మేరకే తను రాజీనామా చేసినట్లు సమాచారం.
ఇదిలా ఉండగా కేంద్ర ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దీంతో గవర్నర్ గా కాకుండా తమిళి సై సౌందర రాజన్ ను ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకు రావాలని పార్టీ హైకమాండ్ భావించింది.
చెన్నై సెంట్రల్ నుంచి ఎంపీ టికెట్ ఇవ్వనున్నట్లు బిగ్ ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. అందుకే గవర్నర్ కీలక పదవి నుంచి తప్పుకుంటున్నట్లు స్పష్టం చేశారు. సుదీర్ఘ కాలం పాటు తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్ గా ఉన్నారు.