NEWSTELANGANA

తెలంగాణ‌లో 13 మంది ఐఏఎస్ ల బ‌దిలీ

Share it with your family & friends

స్మితా స‌బ‌ర్వాల్ కు టూరిజం శాఖ‌కు

హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం 13 మంది ఐఏఎస్ అధికారుల‌ను బ‌దిలీ చేసింది. ఆర్థిక శాఖ కార్య‌ద‌ర్శిగా ఉన్న స్మితా స‌బ‌ర్వాల్ ను బ‌దిలీ చేసింది. ఆమెను ప‌ర్యాట‌క శాఖ‌కు ట్రాన్స్ ఫ‌ర్ చేసింది. ప్ర‌స్తుతం స్మితా స‌బ‌ర్వాల్ మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల అధికారిగా ఉన్నారు.

ఇంఛార్జిగా ఉన్న ఇలంబ‌ర్తికి జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ గా పూర్తి బాధ్య‌త‌లు అప్ప‌గించింది స‌ర్కార్. బ‌దిలీ అయిన వారిలో ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు ఉన్నారు. నారాయ‌ణ‌పేట‌కు చెందిన చిట్టెం ల‌క్ష్మికి హైద‌రాబాద్ లోనే పోస్టింగ్ ఇచ్చారు.

ఇక కీల‌క‌మైన శాఖ ట్రాన్స్ కో కు సీఎండీగా కృష్ణ భాస్క‌ర్ , ట్రాన్స్ పోర్ట్ క‌మిష‌న‌ర్ గా సురేంద్ర మోహ‌న్ , ఆరోగ్య శ్రీ సీఈవోగా శివ శంక‌ర్ , పంచాయ‌తీరాజ్ డైరెక్ట‌ర్ శ్రీ‌జ‌న్ , ఆయుష్ డైరెక్ట‌ర్ గా చిట్టెం ల‌క్ష్మి, ఇంట‌ర్ డైరెక్ట‌ర్ గా కృష్ణ ఆదిత్య‌ను నియ‌మించింది.

జేఏడీ క‌మిష‌న‌ర్ గా గౌర‌వ్ ఉప్ప‌ల్ , ఎక్సైజ్ శాఖ డైరెక్ట‌ర్ గా హ‌రి కిర‌ణ్ , లేబ‌ర్ క‌మిష‌న‌ర్ గా సంజ‌య్ కుమార్ , టూరిజం క‌ల్చ‌రల్ సెక్ర‌ట‌రీగా స్మితా స‌బ‌ర్వాల్ , బీసీ సంక్షేమ శాఖ కార్య‌ద‌ర్శిగా శ్రీ‌ధ‌ర్ , మ‌హిళా , శిశు సంక్షేమ శాఖ కార్య‌ద‌ర్శిగా అనితా రామ‌చంద్ర‌న్ కు బాధ్య‌త‌లు అప్ప‌గించారు.

వీరితో పాటు మ‌రో ఎనిమిది మంది ఐఎఫ్ఎస్ అధికారుల‌ను కూడా బ‌దిలీ చేసింది. అధికారులు వెంట‌నే త‌మ‌కు కేటాయించిన పోస్టుల‌లో చేరాల‌ని ఉత్త‌ర్వుల‌లో పేర్కొన్నారు.