NEWSTELANGANA

రూ.7 వేల కోట్ల‌తో రెండో విడ‌త రుణ మాఫీ

Share it with your family & friends

ల‌బ్ది పొంద‌నున్న 6 ల‌క్ష‌ల మంది రైతులు

హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేర‌కు ఇచ్చిన మాట మేర‌కు తాము రైతులు తీసుకున్న రుణాల‌ను మాఫీ చేస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు ముఖ్య‌మంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి.

జూలై 30 రాష్ట్ర వ్యాప్తంగా రైతుల‌కు పండుగ రానుంద‌ని పేర్కొన్నారు. తొలి విడ‌త‌గా 7 ల‌క్ష‌ల మంది రైతులకు ప్ర‌యోజ‌నం చేకూరింద‌న్నారు. తాజాగా రెండో విడ‌త కింద 6 ల‌క్ష‌ల మంది రైతుల‌కు ప్ర‌యోజ‌నం క‌లుగుతుంద‌ని చెప్పారు సీఎం.

అన్న‌దాత‌ల ఖాతాలలో సాయంత్రం వ‌ర‌కు రూ. 7,000 వేల కోట్లు జ‌మ చేస్తామ‌ని పేర్కొన్నారు. అసెంబ్లీ సాక్షిగా ఈ కార్య‌క్ర‌మానికి తాము శ్రీ‌కారం చుట్టామ‌న్నారు ఎనుముల రేవంత్ రెడ్డి. ఏర్పాట్లు కూడా పూర్తి చేశామ‌ని తెలిపారు.

కాంగ్రెస్ ప్ర‌భుత్వం మాట ఇవ్వ‌ద‌ని , ఇస్తే త‌ప్ప‌ద‌ని అన్నారు సీఎం. రైతుల ప్ర‌యోజ‌నాల కోసం కృషి చేస్తుంద‌న్నారు . ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు. గ‌త ప్ర‌భుత్వం రైతు బంధు పేరుతో మోసం చేసింద‌ని ఆరోపించారు రేవంత్ రెడ్డి.