NEWSTELANGANA

19 జిల్లాల్లో కుల గ‌ణ‌న స‌ర్వే పూర్తి

Share it with your family & friends

14 జిల్లాల్లో కొన‌సాగుతున్న స‌ర్వే

హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది కుల గ‌ణ‌న స‌ర్వేను. సీఎం రేవంత్ రెడ్డి ఇప్ప‌టికే ఈ స‌ర్వే దేశానికి ఆద‌ర్శ ప్రాయంగా, రోల్ మోడ‌ల్ గా త‌యారు కావాలంటూ స్ప‌ష్టం చేశారు.

ఇదిలా ఉండ‌గా పెద్ద ఎత్తున స‌ర్వే కొన‌సాగుతోంది. డెడ్ లైన్ పూర్త‌యినా ఇంకా కొంద‌రు స‌రైన వివ‌రాలు న‌మోదు చేయ‌లేద‌ని స‌మాచారం వ‌చ్చింది. దీంతో గ‌డువు తేదీని పొడిగించింది స‌ర్కార్. తాజాగా రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సీఎస్ శాంతి కుమారి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఈ మేర‌కు ఉత్త‌ర్వుల‌లో ఇప్ప‌టి వ‌ర‌కు చేప‌ట్టిన కుల గ‌ణ‌ణ స‌ర్వే 33 జిల్లాల‌కు గాను 19 జిల్లాల్లో పూర్త‌యింద‌ని వెల్ల‌డించారు.

ఇంకా 14 జిల్లాల్లో చేప‌ట్టాల్సి ఉంద‌ని పేర్కొన్నారు. ఇప్ప‌టికే పూర్తి కాని జిల్లాల్లో స‌ర్వే కొన‌సాగుతోంద‌ని, న‌మోదు ప్ర‌క్రియ‌ను మ‌రింత వేగ‌వంతంగా చేప‌ట్టాల‌ని స్ప‌ష్టం చేశారు సీఎస్. ఇదిలా ఉండ‌గా సీఎం అనుముల రేవంత్ రెడ్డి త‌మ కుటుంబ వివ‌రాల‌ను జూబ్లీ హిల్స్ లో త‌న నివాసంలో స‌ర్వే గ‌ణ‌న అధికారుల‌కు అంద‌జేశారు.