ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
హైదరాబాద్ -కంచ గచ్చిబౌలి లోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీకి చెందిన 400 ఎకరాల భూముల వేలంకు సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. వెంటనే చెట్లు నరకడాన్ని నిలిపి వేయాలని ఆదేశించింది. ఒక్క ఇంచు కూడా ఆక్రమణకు గురి కాకూడదంటూ ఆదేశించింది. సీఎస్ శాంతి కుమారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కమిటీ ఏర్పాటు చేయాలని స్పష్టం చేయడంతో గత్యంతరం లేక సర్కార్ దిగి వచ్చింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటితో కమిటీ ఏర్పాటు చేసింది.
ఈ భూముల వివాదానికి సంబంధించి హెచ్ సీ యూ విద్యార్థులు, ప్రజా సంఘాలతో సంప్రదింపులు జరపగనుంది కమిటీ. ఈ సందర్బంగా భట్టి, శ్రీధర్ బాబు, పొంగులేటి మీడియాతో మాట్లాడారు. తమకు సుప్రీంకోర్టు పట్ల గౌరవం ఉందని చెప్పారు. భారత దేశ సర్వోన్నత న్యాయస్థానం కోరిన సమాచారాన్ని గడువు లోగా పంపిస్తామని అన్నారు. తమ ప్రభుత్వానికి పూర్తి విశ్వాసం ఉందన్నారు. చివరకు న్యాయం గెలుస్తుందన్నారు. ఇదిలా ఉండగా విద్యార్థులపై కఠినంగా వ్యవహరించ వద్దని అదనపు డీజీ (ఇంటెలిజెన్స్), సైబరాబాద్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశామన్నారు.