మళ్లీ వాళ్లే ఇన్ చార్జి వీసీలు
తీరు మారని కాంగ్రెస్ సర్కార్
హైదరాబాద్ – గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో హవా చెలాయించిన , తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో కొందరికి విశ్వ విద్యాలయాలకు వీసీలను నియమించడంపై సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. 10 యూనివర్శిటీలకు ఇంఛార్జి వీసీలుగా బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సీఎం ఆదేశాల మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
ఇక గత సర్కార్ లో ఆరోగ్య శాఖ బాధ్యతలు చూసిన వాకాటి కరుణకు కాకతీయ విశ్వ విద్యాలయం అప్పగించారు. ఆమెపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. విచిత్రం ఏమిటంటే ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తి కాదు.
ఉస్మానియా యూనివర్శిటీకి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ దాన కిషోర్ , జేఎన్టీయూకు బుర్రా వెంకటేశం, అంబేద్కర్ సార్వత్రిక విశ్వ విద్యాలయానికి రిజ్వీ, తెలంగాణ యూనివర్శిటీకి సందీప్ సుల్తానియా, తెలుగు యూనివర్శిటీకి శైలజా రామయ్యర్ కు బాధ్యతలు అప్పగించారు.