సచివాలయంలోకి వెళ్లాలంటే ఒక్కరికే
హైదరాబాద్ – రేవంత్ రెడ్డి రాచరిక పాలనకు తెర తీశారు. గతంలో ఎక్కువ మంది సచివాలయానికి వెళ్లే వారు. ఇప్పుడు ఆ సీన్ లేదు. ఇకపై వివిధ పనుల నిమిత్తం వెళ్లే వారికి ఛాన్స్ ఉండదు. ఇక్కడికి వెళ్లాలంటే ఇచ్చే పాసుతో ఒక్కరికి మాత్రమే అనుమతి ఉంటుంది.
గతంలో విజిటర్స్ సంఖ్యపై ఆంక్షలు విధించలేదు బీఆర్ఎస్ సర్కార్. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం కార్యాలయం ఉండే ఆరో అంతస్తుకు సందర్శకులను అనుమితంచ బోమంటూ ప్రకటించింది.
రోజు రోజుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు మరింత ప్రజల్లో అసంతృప్తిని రాజేస్తోంది. ఎక్కడ చూసినా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్వంత పనుల కోసం వచ్చే వారికి తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆశనిపాతంలా మారింది.
ఆరు గ్యారెంటీల పేరుతో ఎన్నికల సందర్బంగా ఇచ్చారు. కానీ వాటిని తీర్చాలంటే , అమలు చేయాలంటే దేశ బడ్జెట్ కూడా సరిపోని పరిస్థితి. పాలన గాడి తప్పిందని , ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా తయారైందని విమర్శలు ఉన్నాయి. మొత్తంగా రేవంత్ రెడ్డి తీవ్ర వ్యతిరేకతను మూటగట్టు కోవడం విస్తు పోయేలా చేసింది.