NEWSTELANGANA

క‌రెంట్ కోత‌లు బీఆర్ఎస్ అబ‌ద్దాలు

Share it with your family & friends

ఖండించిన కాంగ్రెస్ ప్ర‌భుత్వం

హైద‌రాబాద్ – రాష్ట్రంలో ఎక్క‌డా క‌రెంట్ స‌ర‌ఫరాకు ఇబ్బంది లేద‌ని స్ప‌ష్టం చేసింది కాంగ్రెస్ స‌ర్కార్. ఈ మేర‌కు సోమ‌వారం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. బీఆర్ఎస్ చేస్తున్న ఆరోప‌ణ‌ల్లో వాస్త‌వం లేద‌ని తెలిపింది. ఎక్క‌డా క‌రెంట్ కోత‌లు లేవ‌ని అవ‌న్నీ అబద్దాలేనంటూ ఎద్దేవా చేసింది.

రాష్ట్రంలో డిమాండ్ కు తగ్గట్టుగా విద్యుత్ సరఫరా చేస్తున్న‌ట్లు పేర్కొంది స‌ర్కార్. గత సంవత్సరంలోని వేసవి కాలం కంటే ఈ ఏడాది రికార్డు స్థాయిలో విద్యుత్ సరఫరా చేసిన‌ట్లు తెలిపింది.

గతంలో కంటే ఈ ఏడాది ఉషోగ్రతలు ఎక్కువ నమోదు అయ్యాయ‌ని, ఏసీలు, కూలర్లు, ఫ్యాన్ల వాడకం ఎక్కువగా పెరిగిందని వెల్ల‌డించింది. అయినా సరే ఎక్కడా కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా విద్యుత్ సరఫరా చేసిన‌ట్లు తెలిపింది.

వర్షా కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం విద్యుత్ తీగలకు ఆనుకుని ఉండే చెట్ల కొమ్మలను తొలగించడం కోసం, విద్యుత్ స్తంభాలకు కొత్త లైట్లను బిగించడం కోసం, విద్యుత్ ట్రాన్స్ ఫారంలు, తీగలు, స్తంభాల మెయింటెనెన్స్ కోసం మాత్రమే ఆయా ప్రదేశాలలో విద్యుత్ నిలిపి వేయడం జరిగిందే తప్ప.. విద్యుత్ కోతలు ఎక్కడా లేవని స్ప‌ష్టం చేసింది.

ఎవరైనా విద్యుత్ అధికారులు కావాలని ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకు వచ్చేలా అనవసరంగా విద్యుత్ నిలిపివేస్తే అధికారుల పై చర్యలు కూడా తీసుకుంటున్నట్లు పేర్కొంది.