రైతన్నల ఖాతాల్లోకి రూ. 7 వేల కోట్లు
స్పష్టం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తొలి విడతలో 11 లక్షల 50 వేల మంది రైతులకు గురువారం చెప్పినట్లే వారి ఖాతాల్లో డబ్బులను జమ చేస్తూ వస్తోంది. దీంతో రైతుల కళ్లల్లో ఆనందం అగుపిస్తోందని పేర్కొన్నారు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.
దశల వారీగా రుణాల మాఫీకి సంబంధించి నిధులు విడుదల చేస్తామని ప్రకటించారు. ప్రస్తుతానికి ఇవాల్టితో రైతుల ఖాతాల్లోకి రూ. 7 వేల కోట్లు జమ చేశామని స్పష్టం చేశారు. రెండో విడత కింద జూలై నెలాఖారు లోపు లక్షన్నర లోపు రుణాలు మాఫీ చేస్తామని వెల్లడించారు సీఎం , డిప్యూటీ సీఎం.
అంతే కాకుండా వచ్చే నెల ఆగష్టు నెలాఖరు లోగా రూ. 2 లక్షల రుణాలను మాఫీ చేస్తామని స్పష్టం చేశారు. రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని కోరారు. రైతుల రుణాల మాఫీకి సంబంధించి దాదాపు రూ. 31 వేల కోట్లకు పైగా ఖర్చు అవుతోందని తెలిపారు.
ఓ వైపు గత ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసి వెళ్లిందని, అయినా అష్ట కష్టాలు పడి రైతులకు మేలు చేకూర్చేలా ఇచ్చిన హామీ మేరకు అమలు చేయడం జరుగుతోందని చెప్పారు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క.