కాంగ్రెస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం
ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో ఎనిమిది మంది ఐపీఎస్ లను బదిలీ చేసింది. ఈ మేరకు సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. వారికి కొత్త పోస్టింగ్ లు ఇచ్చింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరాక ఐపీఎస్ ల బదిలీలు ఎక్కువగా జరుగుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి పదే పదే పోలీస్ ఆఫీసర్లను మార్చుతుండడం విస్తు పోయేలా చేస్తోంది.
ఏ ప్రభుత్వమైనా పని చేసే వారిని కొంత కాలం ఉండనిస్తే పని చేసేందుకు వీలు కలుగుతుంది. సమర్థవంతమైన ఆఫీసర్ గా పేరు పొందిన కొత్తకోట శ్రీనివాస్ రెడ్డిని సీపీగా నియమించారు సీఎం. ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ ఎంఐఎం ఒత్తిళ్ల మేరకు తనను బదిలీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఇదిలా ఉండగా తాజాగా మరికొందరు ఐపీఎస్ లకు స్థాన చలనం కలిగింది. వారిలో ఎనిమిది మంది ఆఫీసర్లు ఉన్నారు. ఇక బదిలీ అయిన వారిలో పి విశ్వ ప్రసాద్ (అదనపు సిపి క్రైమ్స్), డాక్టర్ బి నవీన్ కుమార్ (ఎస్పీ సిఐడి), డాక్టర్ గజురావు భూపాల్ (జాయింట్ సిపి ట్రాఫిక్ సైబరాబాద్), డి జోయెల్ డేవిస్ (జాయింట్ సిపి హైదరాబాద్), సిరిశెట్టి సంకీర్త్ (గవర్నర్‌కు ఎడిసి), బి రామ్ రెడ్డి (ఎస్పీ సిఐడి), సిహెచ్ శ్రీధర్ (ఎస్పీ ఇంటెలిజెన్స్) ఎస్ చైతన్య కుమార్ (డిసిపి ఎస్బీ హైదరాబాద్) ఉన్నారు.