మెగాస్టార్ కు ఘన సన్మానం
పద్మశ్రీ గ్రహీతలకు అభినందన
హైదరాబాద్ – పద్మ విభూషణ్ పురస్కారానికి ఎంపికైన తెలుగు సినీ రంగానికి చెందిన ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవిని ఘనంగా సన్మానించారు. పద్మ అవార్డులను పొందిన ఏపీ, తెలంగాణకు చెందిన గ్రహీతలను సత్కరించింది. ఒక్కొక్కరికి రూ. 25,00,000 రూపాయల చెక్కును అందజేసింది.
ఈ కార్యక్రమంలో సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు అవార్డు గ్రహీతలను సన్మానించారు. ఇదే సమయంలో చిరంజీవికి శాలువాతో పాటు జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమం హైదరాబాద్ లోని శిల్ప కళా వేదికగా అద్భుత కార్యక్రమాన్ని చేపట్టారు.
చిరంజీవితో పాటు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో పాటు పద్మశ్రీ అవార్డులు పొందిన వేళు ఆనంద చారి, ఉమ్మడి పాలమూరు జిల్లా దామరగిద్ద మండలానికి చెందిన దాసరి కొండప్ప, ఉమా మహేశ్వరి, గడ్డం సమ్మయ్య, కేతావత్ సోమ్ లాల్ , కూరెళ్ల విఠలాచార్యలను సన్మానించారు.
అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. వెంకయ్య నాయుడుతో పాటు చిరంజీవి, పద్మశ్రీ గ్రహీతలను సత్కరించడం తెలుగు వారందరికీ గర్వ కారణమని పేర్కొన్నారు. కవులు, కళాకారులు, రచయితలు, గాయనీ గాయకులకు నెల నెలా పెన్షన్ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు.