Saturday, May 24, 2025
HomeNEWSగ‌చ్చిబౌలి భూముల వ్య‌వ‌హారంపై పిటిష‌న్

గ‌చ్చిబౌలి భూముల వ్య‌వ‌హారంపై పిటిష‌న్

దాఖ‌లు చేసిన తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం

హైద‌రాబాద్ – హైద‌రాబాద్ లోని హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్శిటీకి చెందిన కంచె గ‌చ్చిబౌలి లోని 400 ఎక‌రాల భూముల వ్య‌వ‌హారంపై ప్ర‌భుత్వం మేల్కొంది. కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసింది. ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో న‌కిలీ వీడియోలు సృష్టించి ప్ర‌చారం చేశారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది మేనక గురుస్వామి వాదనలు వినిపించారు.

మొత్తం 400 ఎకరాలకు సంబంధించిన నకిలీ వీడియోలు, ఆడియో క్లిప్పింగ్స్‌ తయారు చేశారని కోర్టు దృష్టికి తీసుకు వెళ్లారు. భూమిని చదును చేసే క్రమంలో బుల్డోజర్లను చూసి జింకలు, నెమళ్లు పారిపోతున్నట్లు నకిలీ వీడియోలు సృష్టించారని పిటిషన్‌లో ఆరోప‌ణ‌లు చేశారు.నకిలీ వీడియోలు సృష్టించిన వారిపై తగిన చర్యలు తీసుకునేలా ఆదేశించాలని ప్రభుత్వం న్యాయస్థానాన్ని కోరింది. ఈ సంద‌ర్బంగా దాఖ‌లైన పిటిష‌న్ పై కోర్టు విచార‌ణ చేప‌ట్టింది. ఏప్రిల్‌ 24న వాదనలు వింటామని హైకోర్టు వెల్లడించింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments