NEWSTELANGANA

తెలంగాణ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం

Share it with your family & friends

అన‌ర్హుల గుర్తింపు వేగ‌వంతం

హైద‌రాబాద్ – కొత్త‌గా కొలువు తీరిన కాంగ్రెస్ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో అన‌ర్హులు పెద్ద ఎత్తున ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాల ద్వారా ల‌బ్ది పొందుతున్న‌ట్లు త‌మ ప‌రిశీల‌న‌లో వెల్ల‌డైంద‌ని తెలిపింది. ఈ మేర‌కు ఎవ‌రెవ‌రు ఉన్నార‌నే దానిపై విచార‌ణ ప్రారంభించామ‌ని పేర్కొంది.

పలు అభివృద్ధి సంక్షేమ పధకాలను పొందే లబ్ది దారుల్లో పలువురు అనర్హులు ఉన్నట్టు పలు మార్గాల ద్వారా ప్రభుత్వ దృష్టికి వచ్చిందని తెలిపింది. ఈ ప్రభుత్వ పధకాలు మరింత సమర్థవంతంగా, అర్హులైన లబ్ధిదారులందరికీ అందించాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి సంకల్పం మేరకు, ఈ పధకాల అమలు తీరును క్రమబద్దీకరించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని స్ప‌ష్టం చేసింది.

అర్హులైన లబ్ధిదారులకు మరింత మెరుగుగా, సమర్థవంతంగా పథకాలను వర్తింప చేసేందుకు రాష్ట్ర శాసన సభకు సంబంధించి రాబోయే బడ్జెట్ సమావేశాలలో, పధకాల అమలులో గుర్తించిన అవకతవకలను చర్చించి తగు చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

సంక్షేమ పథకాల ప్రయోజనాలను మరింత మెరుగ్గా అందించడం, అనర్హులు పొందుతున్న ప్రయోజనాలను గుర్తించి, వాటిని రికవరీ చేసే విధానాలకై ప్రభుత్వం త్వరలో స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేస్తుందని స్ప‌ష్టం చేసింది.

   ఈ  మార్గ దర్శకాలను జారీ చేసే వరకు  ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలలో చేర్చబడిన లబ్ధిదారులకు నోటీసులు జారీ చేయడం లేదా మొత్తాలను రికవరీ చేయడం కోసం ఎటువంటి చర్యలు తీసుకోవద్దని సచివాలయంలో అన్నివిభాగాలకు, జిల్లా కలెక్టర్లకు  ప్రభుత్వం  ఆదేశాలను జారీ  చేసింది.