గెలల ధరలు పెంచుతూ నిర్ణయం
హైదరాబాద్ – నూతన సంవత్సరం సందర్బంగా ఖుష్ కబర్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. పామాయిల్ రైతులకు గెలల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. టన్ను పామాయిల్ గెలల ధర రూ. 20,506 గా నిర్ణయించినట్లు తెలిపింది. ఈ మేరకు తీర్మానం చేసినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు వెల్లడించారు.
తమ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని స్పష్టం చేశారు. రైతులను ఆదుకుంటామన్నారు.
ఇదిలా ఉండగా పెంచిన పామాయిల్ గెలల ధరలు జనవరి 1 నుంచే అమలులోకి వస్తాయని స్పష్టం చేశారు. ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకుండా ఉండేందుకే తాము ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ఇదిలా ఉండగా తాము ఇచ్చిన హామీలను ఆరు నూరైనా సరే చర్యలు తీసుకుని తీరుతామని పేర్కొన్నారు.
తమ ప్రభుత్వం పేదల పక్షపాత ప్రభుత్వమని అన్నారు. ఇప్పటికే కోట్లాది రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందన్నారు. కాగా గత బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనా కాలంలో తెలంగాణను అభివృద్ది పేరుతో విధ్వంసం చేశారని ఆరోపించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.