ధరలను పెంచిన తెలంగాణ రాష్ట్ర సర్కార్
హైదరాబాద్ – రాష్ట్ర ప్రభుత్వం మద్యం బాబులకు కోలుకోలేని షాక్ ఇచ్చింది. బీర్ల ధరలను సవరిస్తున్నట్లు ప్రకటించింది. ధరల పెంపుపై ఏర్పాటు చేసిన రిటైర్డ్ జడ్డి జైస్వాల్ నేతృత్వంలోని కమిటీ ధరలు పెంచాలని సిఫార్సు చేసింది. ఈ మేరకు నివేదిక సమర్పించింది ప్రభుత్వానికి. కమిటీ సూచనల మేరకు 15 శాతం ధర పెంచుతూ నిర్ణయించింది. మంగళవారం నుంచే పెరిగిన ధరలు అమలులోకి వస్తాయని స్పష్టం చేసింది. దీంతో బావురుమంటున్నారు మద్యం ప్రియులు.
ఇదిలా ఉండగా రాష్ట్రంలో జరిగిన ఎన్నికల సందర్బంగా పూర్తిగా మద్య నిషేధం విధిస్తానంటూ ప్రగల్భాలు పలికారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కానీ యధావిధిగా మద్యం అమ్మకాలు మరింత పెరగడం విశేషం. ఓ వైపు రాష్ట్రానికి అత్యధిక ఆదాయం కేవలం మద్యం అమ్మకాల ద్వారానే వస్తుండడంతో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా వాటిని నియంత్రించేందుకు చర్యలు చేపట్టడం లేదు.
మద్యం ఎఫెక్ట్ జనాలను పిచ్చి వాళ్లను చేస్తోంది. పెద్ద ఎత్తున ఆస్పత్రుల పాలవుతున్నారు. మద్యం మత్తుకు బానిసలవుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. పిల్లలు, పెద్దలు, యువత కూడా వీటి బారిన పడుతున్నారు. వావి వరసలు మరిచి పోతున్నారు. హత్యలు, అత్యాచారాలకు పాల్పడుతున్నారు.