దావోస్ వేదికగా సీఎం బిగ్ సక్సెస్
దావోస్ – తెలంగాణ ప్రభుత్వం అరుదైన రికార్డ్ సాధించింది. దావోస్ వేదికగా జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, ఐటీ కార్యదర్శి జయేశ్ రంజన్ రైజింగ్ బృందం కీలకంగా వ్యవహరించింది. దిగ్గజ కంపెనీ అమెజాన్ భారీగా పెట్టుబడి పెట్టింది.
రూ. 60 వేల కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు తెలిపింది. ఇప్పటి వరకు రూ. 1.32 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించింది సర్కార్. గత ఏడాది దావోస్ టూర్ లో రాష్ట్రానికి రూ. 40,232 కోట్లు సాధించింది.
దిగ్గజ కంపెనీలతో సంప్రదింపులు జరుపుతూ వచ్చారు. వివిధ కంపెనీల ముఖ్యలు, ప్రముఖులు, చైర్మన్లు, సిఇఓలు, ఎండీలు , ప్రతినిధులతో భేటీ అయ్యారు. తమ ప్రభుత్వం ఐటీ , ఫార్మా, లాజిస్టిక్ రంగాలపై ఎక్కువగా ఫోకస్ పెట్టిందన్నారు.
మరో వైపు ఇండియా నుంచి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తో పాటు తెలంగాణ సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కలిసి మాట్లాడారు. పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇది కూడా చర్చనీయాంశంగా మారింది.
సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి చెందిన వారైనప్పటికీ ఆయన గురువు చంద్రబాబు బీజేపీతో కలిపి సర్కార్ ఏర్పాటు చేశారు.